విజయ్ ఆంటోనీ నటిస్తున్న సినిమా లవ్ గురు. మృణాళిని రవి కథానాయిక. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం. విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ట్రైలర్‌ని విడుదల చేశారు. తండ్రి పోరు పడలేక పెళ్లికి ఒప్పుకున్న ప్రియ పెళ్లి చూపుల టైమ్‌లో తనను చూడ్డానికి వచ్చిన కుర్రాడికి కొన్ని కండిషన్స్ పెడుతుంది. అమ్మాయి నచ్చడంతో ఆ కండిషన్స్ అన్నింటికీ ఆ కుర్రాడు తలూపాడు. పెళ్లయ్యాక ఆ కండీషన్స్ వల్ల కలిగే ఇబ్బందులు అర్థమయ్యాయి. ఆ ఇబ్బందుల నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? ఈ అంశాలన్నీ ట్రైలర్‌లో కనిపిస్తున్నాయి. యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా నచ్చేలా సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. వీటీవీ గణేశ్, తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధ, శ్రీజ రవి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రంజాన్ పండుగ సందర్భంగా ఏప్రిల్ 11న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: ఫరూక్ జె.భాష, సంగీతం: భరత్ ధనశేఖర్, సమర్పణ: మీరా విజయ్ ఆంటోనీ, నిర్మాత, ఎడిటింగ్, విజయ్ ఆంటోనీ, నిర్మాణం: విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్.