Namaste NRI

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ టీజర్ విడుదల

విజయ్‌ దేవరకొండ న‌టిస్తున్న చిత్రం  ఫ్యామిలీ స్టార్‌. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక.  ఈ చిత్రానికి పరశురామ్‌ దర్శకుడు. దిల్‌రాజు, శిరీష్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభించిందని చిత్రబృందం ఆనందం వెలిబుచ్చింది. ఈ నేపథ్యం లోనే ఈ చిత్రానికి చెందిన టీజర్‌ను విడుదల చేశారు. గోపీసుందర్‌ సంగీత దర్శకత్వం వహించిన దేఖోరే దేఖో పాటతో హీరో పాత్రచిత్రణను అభివర్ణిస్తూ టీజర్‌ ఆద్యంతం కలర్‌ఫుల్‌గా సాగింది. సర్‌ నేమ్‌కు సరెండరై, ఫ్యామిలీ అంటే వీక్‌నెస్‌ ఉన్న కలియుగ రాముడిగా ఈ టీజర్‌లో విజయ్‌ దేవరకొండ కనిపించాడు. కుటుంబ క్షేమం కోసం దైవాన్ని పూజిస్తూ, వారిని కంటికి రెప్పలా చూసుకుంటుంటాడు ఇందులో హీరో. వాళ్లజోలికి ఎవరైనా వస్తే మడతపెట్టి కొడతాడు. అతను వేస్తే బడ్జెట్‌ షాక్‌. ప్లాన్‌ గీస్తే ప్రాజెక్ట్‌ షేక్‌ అంటూ టీజర్‌లో హీరో గురించి దాదాపుగా చెప్పేశారు. టీజర్‌ చివరల్లో మృణాల్‌ అడుగుతుంది. కాలేజ్‌కి వెళ్లాలి.. కొంచెం దింపుతా వా? అని. లీటర్‌ పెట్రోల్‌ కొట్టిస్తే దించేస్తా అంటాడు హీరో. కంప్లీట్‌ ఫ్యామిలీమేన్‌గా ఇందులో విజయ్‌ దేవరకొండ కనిపిస్తాడనటానికి ఈ టీజర్‌ ఓ ఉదాహరణ. ఈ చిత్రం ఏప్రిల్‌ 5న విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News