Skip to main content

Namaste NRI

సుప్రీంకోర్టు సారీ చెప్పిన విజయ్ ప్రభుత్వం.. ఎందుకంటే?

తమిళనాడులోని మదురై తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో తలెత్తిన వివాదం సుప్రీంకోర్టు గడప తొక్కింది. కొండపై ఉన్న సిక్కందర్ దర్గా సమీపంలోని పురాతన రాతి స్తంభంపై ఈ ఏడాది కార్తీక దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలు కూడా అమలు కాకపోవడంతో ఈసారి సుప్రీంకోర్టు ఈ కీలక ఆదేశాలు ఇచ్చింది.

అయితే, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ మంగళవారం నాడు ఆ రాతి స్తంభంపై దీపం వెలిగించలేదు. దీనిపై బుధవారం తమిళనాడు ప్రభుత్వం, మదురై కలెక్టర్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తూ క్షమాపణలు చెప్పారు. రాతి స్తంభం వద్ద దీపం వెలిగిస్తే తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలు దెబ్బతింటాయని ఆలయ ట్రస్టీలు అభ్యంతరం వ్యక్తం చేశారని, ఆలయ యంత్రాంగం అనుమతించకపోవడం వల్లే కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేకపోయామని కలెక్టర్ వివరించారు.

ఫలితంగా తిరుప్పరంకుండ్రం కొండపై ఎప్పటిలాగే ఉచ్చిప్పిళ్లైయార్ ఆలయ దీప మండపంపైనే మహాదీపం వెలిగిందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. మరోవైపు, కోర్టు ఆదేశాలను పాటించకపోవడాన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించాలంటూ పిటిషనర్లు చేసిన అభ్యర్థనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events