విజయ్ ఆంటోని కథానాయకుడిగా రూపొందిన చిత్రం నాన్న కుట్టి. ప్రీతి అస్రానీ కథానాయిక. ము.మారన్ దర్శకుడు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై మీరా విజయ్ ఆటోని సమర్పణలో ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో విజయ్ ఆంటోని మాట్లాడారు. నాన్న కుట్టి సినిమా బాగా వచ్చింది. ప్రథమార్ధం సరదాగా సాగుతుంది. ద్వితీయార్ధం భావోద్వేగపూరితంగా ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా లిథాన్య పాత్రతో అంతా కనెక్టవుతారు. ఇది అందరికీ నచ్చే సినిమా అని అన్నారు.

తండ్రీకూతుళ్ల అనుబంధమే ఈ సినిమాకు ప్రధాన బలమని, మంచి కంటెంట్‌తో రానున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని దర్శకుడు ము.మారన్ తెలిపారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు. తండ్రీకూతుళ్ల భావోద్వేగాలను ఆవిష్కరిస్తూ ట్రైలర్ ఆద్యంతం సాగింది. ఈ చిత్రం ఈనెల 27న విడుదల కానున్నది.















