Skip to main content

Namaste NRI

చిరు పేరులో ‘N’ మాయంపై వీడిన సస్పెన్స్!

మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా డిజిటల్ తెరపై వ్యాఖ్యాతగా మారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ‘చిరంజీవీస్ మెగావర్స్’ పేరుతో రాబోతున్న ఈ ప్రత్యేక సెలబ్రిటీ టాక్ షో టీజర్ విడుదలైంది. ఇదిప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. గత కొన్ని రోజులుగా పోస్టర్లలో తన పేరులోని ‘N’ అక్షరం (CHIRA_JEEVI) మిస్ అవ్వడంపై నెలకొన్న ఉత్కంఠకు ఈ ప్రోమోతో తెరపడింది. నెట్‌ఫ్లిక్స్ లోగోను గుర్తుచేస్తూ ఆ ‘N’ అక్షరాన్ని రివీల్ చేసిన చిరు.. “ఇది నా అడ్డా” అంటూ చెప్పిన డైలాగ్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేసింది.

మెగా నోస్టాల్జియా, నవ్వులు, ఆసక్తికర ముచ్చట్లతో కూడిన ఈ షో లాంచింగ్ ఈవెంట్‌ను ఈ నెల 30న సాయంత్రం 4:30 గంటలకు హైదరాబాద్‌లో అత్యంత గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెలబ్రిటీలతో పాటు మెగా అభిమానులు హాజరుకానున్న ఈ వేడుకపై ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. ఈ షో ద్వారా చిరంజీవి తన సినీ ప్రయాణంలోని మధుర జ్ఞాపకాలను పంచుకోవడంతో పాటు, అతిథులతో సరదాగా ముచ్చటించనున్నారు.

ఇక ఈ టాక్ షోకు రాబోయే అతిథుల జాబితా కూడా ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. లోకనాయకుడు కమల్ హాసన్, అక్కినేని నాగార్జున వంటి సీనియర్ స్టార్లతో పాటు ప్రభాస్, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, రవితేజ, నాని వంటి అగ్ర హీరోలు ఇందులో సందడి చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు దర్శకులు సందీప్ రెడ్డి వంగా, బాబీ కొల్లి, హాస్యనటులు బ్రహ్మానందం, సునీల్, సత్య కూడా ఈ ‘మెగావర్స్’లో భాగం కానున్నారని సమాచారం. త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ షో కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events