కన్నడ హీరో కిచ్చా సుదీప్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా విక్రాంత్ రోణ. జాక్వెలైన్ ఫెర్నాండేజ్, నిరూప్ భండారి, నీతా అశోక్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. హీరో నాగార్జున అతిథిగా విచ్చేసి బిగ్ టికెట్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మన దగ్గర సినిమాలు రూపొందించారు అని గర్వంగా చెప్పుకునే సినిమాలు బాహుబలి, ఆర్ఆర్ఆర్ అలా కొన్నే ఉంటాయి. విక్రాంత్ రోణ అలా చెప్పుకునే సినిమా అవుతుంది. ట్రైలర్ చాలా బాగుంది. మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా అవుతుంది. కంటెంట్ నచ్చితే తెలుగు ప్రేక్షకులు ఏ సినిమాకైనా ఘన విజయాన్ని అందిస్తారు అన్నారు. దర్శకుడు అనూప్ భండారి మాట్లాడుతూ నా 20 ఏళ్ల కల ఈ సినిమా. తొలి కథ సుదీప్‌ను దృష్టిలో పెట్టుకునే రాసుకున్నా. ఇన్నాళకు ఈ చిత్రం ద్వారా ఆయన్ని డైరెక్ట్ చేయగలిగా నా కెంతో గర్వంగా ఉంది అన్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణలో శాలిని ఆర్ట్ బ్యానర్స్‌పై శాలిని మంజునాథ్, జాక్ మంజునాథ్ నిర్మించారు. త్రీడీ ఫార్మాట్లో దర్శకుడు అనూప్ భండారి రూపొందిస్తున్నారు. ఈ నెల 28న విడుదల సిద్ధమవుతున్నది. ఈ కార్యక్రమంలో నటీనటులూ నీతూ, నిరూప్ భండారీ, జానీ మాస్టర్, గీత రచయిత రామజోగ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.














