Namaste NRI

విమానం టీజర్‌ రిలీజ్‌

తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా విమానం. శివ ప్రసాద్‌ యానాల దర్శకత్వం. చరణ్‌ అర్జున్‌ సంగీతం అందిస్తున్నాడు. ద్విభాషా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాను జీ స్టూడీయోస్‌తో కలిసి కిరణ్‌ కొర్రపాటి సంయుక్తంగా నిర్మించాడు.  మాస్టర్‌ ధృవన్‌ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అనసూయ, ధన్‌రాజ్, రాహుల్‌ రామకృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌, పోస్టర్‌లు సినిమాపై పాజిటీవ్‌ బజ్‌నే క్రియేట్ చేశాయి. ఈ సినిమాతో పదేళ్ల తర్వాత మీరా జాస్మిన్‌ తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుంది. ఫాదర్‌-సన్‌ సెంటిమెంట్‌తో వస్తున్న ఈ సినిమా జూన్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్‌ వరుస అప్‌డేట్‌లు ప్రకటిస్తూ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేస్తున్నారు. తాజాగా మేకర్స్‌ ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు.

టీజర్‌తో సినిమాపై మేకర్స్‌ కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఓ చిన్న పిల్లాడికి విమానం ఎక్కాలని ఎంతో ఆశ. విమానం ఎక్కించమని తండ్రికి చెబితే,  బాగా చదివితే విమానం ఎక్కొచ్చు అని చెప్పే తండ్రి. మరీ ఆ పిల్లాడి ఆశ నెరవేరిందా? విమానం ఎక్కాడా? అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లు టీజర్‌ చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాలో సముద్రఖని అంగవైకల్యంతో బాధ పడే తండ్రి పాత్రలో కనిపించనున్నాడు. అడిగిన వన్నీ ఇచ్చేవాడ్ని దేవుడు అనరు,  నాన్న అంటారు అనే డైలాగ్‌ టీజర్‌కే హైలేట్‌గా నిలిచింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events