హైదరాబాద్ కు చెందిన యంగ్ అండ్ ఎనర్జిటిక్ ఎంటర్ప్రెన్యూర్ నిడదవోలు వినయ్ రామ్ అరుదైన పురస్కారానికి ఎంపికయ్యారు. పర్యావరణ సంరక్షణ, ప్రకృతి వ్యవసాయ రంగానికి సంబంధించి చేసిన విశేష కృషికి గాను ఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా వినయ్ రామ్ మోస్ట్ ఇన్స్పైరింగ్ గ్రీన్ ఎంటర్ప్రెన్యూర్ 2023 అవార్డు అందుకున్నారు.
అత్యంత సాధారణ కుటుంబానికి చెందిన వినయ్ రామ్ స్వయం కృషి, తెలివి తేటలు, ప్రకృతి మీద ప్రేమే పెట్టుబడిగా ప్రకృతి వ్యవసాయం, గ్రీన్ రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టారు. తాను నమ్మిన దారిలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనుకాడకుండా ముందుకు వెళుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ హైదరాబాద్ లో తన సొంత వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసి తనతో పాటు కొన్ని వందల మందికి ఉద్యోగాలు కల్పించి స్థిర పడేలా చేశారు. ఆయన వేద భారత్ నేచురల్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా సుమారు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఆహార పంటలు పండిస్తున్నారు. అలాగే ప్లానెట్ గ్రీన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా ప్రస్తుతం సుమారు మూడు వందల ఎకరాల్లో హరిత భవన నిర్మాణ సముదాయాలు నిర్మిస్తున్నారు.
ఢిల్లీలోని న్యూ ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ కన్వెన్షన్ సెంటర్‌లో 25 జనవరి 2023న జరిగిన ఇండియన్ అచీవర్స్ అవార్డ్స్ మూడవ ఎడిషన్‌లో మోస్ట్ ఇన్స్పైరింగ్ గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ కేటగిరీలో ఆయన అవార్డు అందుకున్నారు. ఇక ఈ ఈవెంట్‌కు రాజకీయాలు, క్రీడలు మరియు బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు అవార్డు గ్రహీతలుగా హాజరు అయ్యారు. ఇండియన్ అచీవర్స్ అవార్డు జ్యూరీ మెంబర్స్ సుప్రీంకోర్టు జడ్జీలు జ్ఞాన సుధా మిశ్రా, కేజీ బాలకృష్ణన్ సమక్షంలో భారత రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా వినయ్ రామ్ ఈ అవార్డును అందుకున్నారు.

ఇండియన్ అచీవర్స్ అవార్డ్‌లను ఇంటరాక్టివ్ ఫోరమ్ ఆన్ ఇండియన్ ఎకానమీ (IFIE) నిర్వహిస్తుంది, ఇది భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన లాభాపేక్షలేని సంస్థ (80G, 12A, 8A కంప్లైంట్). ఇది ఒక ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డు. ఇది ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూర్ల ప్రయత్నాలను గుర్తించడం, వారి ప్రయత్నాలను అభినందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్, సోషల్ యాక్టివిజం సహా యూనిటీ వంటి వివిధ డొమైన్‌లలో దేశానికి సేవ చేయడానికి ముందుకు వచ్చే పౌరుల అంకితభావాన్ని మెచ్చి వారిని సత్కరిస్తోంది.