
అక్రమ వలసదారుల అరెస్టుకు ట్రంప్ యంత్రాంగం సిద్ధం కావడంతో లాస్ లాస్ ఏంజిల్స్‌లో నిరసనలు చెలరేగాయి. ఈ నిరసనల నేపథ్యంలో కొందరు దుండగులు లాస్ ఏంజిల్స్‌లోని యాపిల్ స్టోర్‌ను లూటీ చేశారు. ముసుగులు ధరించిన వ్యక్తులు స్టోర్‌లోకి ప్రవేశించి గాడ్జెట్లను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక లాస్ ఏంజిల్స్‌లో పరిస్థితిని అదుపు చేయడానికి ట్రంప్ నేషనల్ గార్డులను రంగంలోకి దింపారు.
