విరాట్ కర్ణ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం నాగబంధం. ది సీక్రెట్ ట్రెజర్ ఉపశీర్షిక. నభా నటేష్, ఐశ్వర్యమీనన్ కథానాయికలు. అభిషేక్ నామా దర్శకత్వం. ఈ చిత్రాన్ని కిషోర్ అన్నపురెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నాయకానాయికలపై గణేష్ ఆచార్య నృత్య దర్శకత్వంలో ఓ పాట చిత్రీకరణ జరుగుతున్నది. అభే స్వరపరచిన ఈ పాటను కాలభైరవ, అనురాగ్ కులకర్ణి, మంగ్లీ ఆలపించారు. కాసర్ల శ్యామ్ గీత రచన చేశారు. పాన్ ఇండియా చిత్రమిది. పురాణ ఇతిహాసాల నుంచి ప్రేరణ పొంది ఈ కథను రాసుకున్నాం. పద్మనాభస్వామి, పూరి జగన్నాథ దేవాలయాల్లో ఇటీవల కనుగొనబడిన గుప్తనిధుల నుంచి ప్రేరణ పొంది ఆధ్యాత్మిక సాహసోపేతమైన ప్రయాణంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. విష్ణు దేవాలయాల చుట్టూ ఉన్న రహస్యాన్ని ఈ సినిమాలో ఆవిష్కరిస్తున్నాం అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్రాజన్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: అభిషేక్ నామా.
