Namaste NRI

కేంద్ర హోంమంత్రి అమిత్ షాని ఆహ్వానించిన విరోష్‌ జోడీ

టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం (ఫిబ్రవరి 27) రాజస్థాన్‌ లోని ఉద‌య్‌పూర్‌లో ఘనంగా జరిగిన విష‌యం తెలిసిందే. ప్రముఖ ప్యాలెస్ వేదికగా కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో ఈ వేడుక వైభవంగా నిర్వహించారు. గురువారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో రష్మిక మెడలో మూడు ముళ్లు వేసి విజయ్ దేవరకొండ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ముందుగా తెలుగు సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరుగగా, అనంతరం కొడగు సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహ తంతు నిర్వహించారు. రెండు సంస్కృతుల సమ్మేళనంగా జరిగిన ఈ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

వివాహం అనంతరం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకం గా కలిశారు. సివిల్ డ్రెస్సులో ఆయన నివాసానికి వెళ్లిన ఈ జంట, తమ వివాహ రిసెప్షన్‌కు రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గణపతి విగ్రహాన్ని ఆయనకు కానుకగా అందజేశారు. ఇక రిసెప్షన్ కార్యక్రమాన్ని హైద‌రాబాద్‌లో మార్చి 4న ఓ లగ్జరీ హోటల్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు సమాచారం.


Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events