Namaste NRI

విశాల్‌ పెళ్లి సాయి ధన్సికతో

తమిళ నటుడు విశాల్‌ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. త్వరలోనే హీరోయిన్‌ సాయి ధన్సికను పెళ్లాడనున్నాడు. ఓ కార్యక్రమంలో వారిద్దరూ పెళ్లి తేదీని ప్రకటించినట్లు సమాచారం. విశాల్‌, ధన్సిక ఇద్దరు 15 సంవత్సరాలుగా స్నేహితులుగా కాగా, ఈ ఏడాదిలోనే ఏడడుగుల బంధంతో ఒకటి కాబోతున్నారు. ఆగస్టు 29న ఇద్దరు పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించినట్లు తెలుస్తుంది. విశాల్‌ బర్త్‌డే కూడా అదే రోజుకావడం విశేషం.

సాయి ధన్సిక దక్షిణాదిలో పలు సినిమాలు చేస్తున్నది. తమిళం, కన్నడ, తెలుగుతో పాటు మలయాళ చిత్రాల్లోనూ నటించింది. రజనీకాంత్ నటించిన కబాలి (2016) చిత్రంలో తన నటనతో అందరి ప్రశంసలు అందుకుంది. రజనీకాంత్‌ కుమార్‌ పాత్రలో నటించింది. త్వరలోనే నిశ్చితార్థం, పెళ్లి డేట్లపై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events