Namaste NRI

24/7 ఒకటే ధ్యాస సాంగ్‌ లాంఛ్‌ చేసిన విశ్వక్‌సేన్

బెల్లంకొండ గణేష్‌ హీరోగా నటిస్తున్న సినిమా నేను స్టూడెంట్‌ సార్‌. అవంతిక దస్సాని కథానాయిక. ఈ చిత్రాన్ని ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సతీష్‌ వర్మ నిర్మిస్తున్నారు. రాఖీ ఉప్పలపాటి దర్శకుడు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్రంలోని 24/7 ఒకటే ధ్యాస అనే పాటను హీరో విశ్వక్‌ సేన్‌ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గణేష్‌, నేను మంచి మిత్రులం. తరుచూ డ్యాన్స్‌, జిమ్‌ క్లాసుల్లో కలుస్తుంటాం. ఈ కాన్సెప్ట్‌ నాకు నచ్చింది. గణేష్‌ మంచి కథలతో సినిమాలు చేస్తున్నాడు. సినిమా రంగంలో రోజూ స్టూడెంట్‌నని భావిస్తుంటా అని చెప్పారు. హీరో గణేష్‌ బెల్లంకొండ మాట్లాడుతూ ఫోన్‌ కొనేందుకు కష్టపడుతుండగా వచ్చే మాంటేజ్‌ సాంగ్‌ ఇది. కథను ముందుకు తీసుకువెళ్తుంది. ఈ పాట చూస్తున్నప్పుడు మీకు సహజమైన అనుభూతి కలగాలని కష్టపడి చేశాం. ఆ ఫీల్‌ మీకు చేరిందని ఆశిస్తున్నా అన్నారు.

నిర్మాత సతీష్‌ వర్మ మాట్లాడుతూ మా చిత్రాన్ని ఇంతకంటే ముందే విడుదల చేయాల్సింది. పరీక్షలు జరుగుతున్నాయని ఆగాం. హీరో క్యారెక్టర్‌ ఏంటో ఈ పాట ద్వారా ప్రేక్షకులకు తెలుస్తుంది అన్నారు. కథా రచయిత కృష్ణ చైతన్య మాట్లాడుతూ  కాలేజ్‌ లైఫ్‌లో లెఫ్ట్‌ వింగ్‌, రైట్‌ వింగ్‌ భావజాలాలు ఉంటాయి. కానీ జీవితంలోకి వచ్చేసరికి డబ్బు ఒకటే నిత్యావసరం అని తెలుస్తుంది. ఈ అంశమే ఈ కథకు నేపథ్యం అన్నారు.  జూన్‌ 2న విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events