మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం విశ్వంభర. సోషియో ఫాంటసీ అడ్వెంచర్ కథాంశంతో దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ సినిమా కోసం చిరంజీవి ఫిజికల్‌గా ఫిట్‌గా తయారయ్యారు. దాదాపు 13 భారీ సెట్స్ ద్వారా విశ్వంభర ప్రపంచాన్ని సృష్టించింది చిత్ర బృందం. చిరంజీ వి కెరీర్‌లోనే అత్యధిక వ్యయంతో రూపొందిస్తున్న చిత్రమిదని, విజువల్స్ మరోస్థాయిలో ఉంటాయని అంటు న్నారు. చిరంజీవి షూటింగ్‌లో జాయిన్ అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. కాగా ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఛోటా కె నాయుడు, సంగీతం: యం. యం.కీరవాణి, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్, రచన-దర్శకత్వం: వశిష్ట.
