విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ జంటగా నటిస్తున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. రమాకాంత్ రెడ్డి దర్శకత్వంలో కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వర రెడ్డి, కాటం రమేష్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు క్లాప్ కొట్టగా, నటుడు, దర్శకుడు కాశీ విశ్వనాథ్ కెమెరా స్విఛాన్ చేశారు. ప్రముఖ దర్శకులు నీలకంఠ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు మాట్లాడుతూ స్త్రీ తల్లికావడం ఒక అదృష్టం. ఆ అదృష్టాన్ని వినియోగించుకోకపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఈ చిత్ర కథాంశం. వచ్చే నెల మొదటివారంలో చిత్రీకరణ ప్రారంభించి సెప్టెంబరులో చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు.