యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తన కొత్త చిత్రాన్నిచేస్తున్నారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్‌కు జోడీగా మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. చిత్ర ప్రధాన తారాగణం అంతా ఈ షెడ్యూల్ లో పాల్గొన్నారు. త్వరలో తదుపరి షెడ్యూల్‌ను యూనిట్ ప్రారంభించనుంది. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియో కూడా త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఫన్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, డీవోపీ: మనోజ్ కాటసాని, ప్రొడక్షన్ డిజైనర్: క్రాంతి ప్రియం, ఎడిటర్: అన్వర్ అలీ, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యుసర్స్: సత్యం రాజేష్, విద్యాసాగర్ జె, కాస్ట్యూమ్ డిజైనర్: కల్యాణి, ప్రీతి జుకల్కర్, సౌండ్ డిజైనర్: నాగార్జున తాళ్లపల్లి, ప్రొడక్షన్ మేనేజర్ : శ్రీహరి పెద్దమల్లు.
