
విశ్వక్‌సేన్ తన 13వ సినిమాను షురూ చేశారు. దసరా తో భారీ విజయాన్ని అందించిన ఎస్‌ఎల్‌వీ సినిమాస్ అధినేత సుధాకర్ చెరుకూరి చిత్రానికి నిర్మాత. శ్రీధర్ గంటా దర్శకుడు. గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో హైబడ్జెట్ తో సినిమాను నిర్మించనున్నామని నిర్మాత తెలిపారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో విశ్వక్‌సేన్ పవర్‌ఫుల్ ఐపీఎస్ అధికారిగా నటించనున్నారు. దానికి సంబంధించిన ప్రీలుక్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఎవ్రీ యాక్షన్ ఫైర్స్ ఎ రియాక్షన్ అనే ట్యాగ్‌లైన్ ఈ పోస్టర్‌పై కనిపిస్తున్నది. వీఎస్ 13 వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమాకు రచన, దర్శకత్వం శ్రీధర్ గంటా కాగా, కెమెరా: కిశోర్‌కుమార్, సంగీతం: అజనీష్ లోక్‌నాథ్.
