అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. వరుసగా చర్చలు, సామావేశాల్లో పాల్గొంటూ తన ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తున్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైతే అమెరికా కోసం తన ప్రణాళికలను వివరిస్తూనే కుటుంబ విలువల గురించి తన అభిప్రాయాలు చెబుతున్నారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓసియోలా కౌంటీలో జరిగిన సమావేశంలో తన భార్య అపూర్వతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన వైవాహిక జీవితం గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. నా భార్య అపూర్వ, నేను ఎలా కులసుకున్నామో ఓటర్లు తెలుసుకోవాలనుకుంటున్నారు. తమ పరిచయం గురించి …వివేక్ మాట్లాడుతూ మా తల్లిదండ్రులు మాకు విద్యతో పాటు దేవుడిపై విశ్వాన్ని కలిగించారు. మనం ఎవరిని పెళ్లి చేసుకుంటామో వారి గురించి ఆలోచించాలని వాళ్లు మాకు నేర్పించారు. మేం కూడా మా పిల్లలకు అదే నేర్పిస్తాం అని తెలిపారు. అనంతరం అపూర్వ మాట్లాడుతూ మేమిద్దరం ఒక పార్టీలో కలిశాం. అప్పుడు వివేక్ లా చదువుతున్నాడు. నేను కళాశాల స్టూడెంట్‌ని. ఆ పార్టీలో వివేక్ ఒక్కడే నాకు ఆసక్తికరమైన వ్యక్తిగా కనిపించాడు. దాంతో నన్ను నేను వివేక్‌కు పరిచయం చేసుకున్నాను. తర్వాత ఇష్టాలు, అభిప్రాయాలను ఒకరితో ఒకరం షేర్ చేసుకున్నాం. బహుశా అదే నేను చివరిగా వెళ్లిన పార్టీ. చాలా కాలం పక్క పక్క ఇళ్లలో ఉన్నాం. తర్వాత మా తల్లిదండ్రుల అనుమతితో పెళ్లి చేసుకున్నాం అని తెలిపారు.