తన మనసులోని కోరికను బయటపెట్టేసింది నటి సాయిపల్లవి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉందట. దానికి బలమైన కారణం కూడా ఉందట. ఆ విషయం గురించి ఆమె మాట్లాడుతూ పెళ్లప్పుడు కట్టుకోమని మా మామ్మ నాకు ఓ చీర ఇచ్చాడు. అప్పుడు నాకు 21ఏళ్లు. అప్పటికింకా నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. అసలు ఆ ఆలోచనే లేదు. పెళ్లి చేసుకునేటప్పుడు కట్టుకుందామని ఆ చీర దాచుకున్నాను. కొనేళ్లకు అనుకోకుండా ప్రేమమ్ తో నటిని అయ్యాను. ఫిదా తో మంచి పేరొచ్చింది. ఏదో ఒక రోజు తప్పకుండా ఒక ప్రతిష్టాత్మక అవార్డు కూడా అందుకుంటాననే నమ్మకం వచ్చింది. అందుకే జాతీయ అవార్డు అనేది నిజంగా నాకొస్తే, అప్పుడు మా మామ్మ ఇచ్చిన చీర కట్టుకొని ఆ అవార్డు అందుకోవాలి అని నిశ్చయించుకున్నా. నిజంగా అవార్డు వచ్చినా, రాకపోయినా, ఆ చీర ధరించే వరకూ ఆ ఒత్తిడి మాత్రం నన్ను వదలదు అంటూ చెప్పుకొచ్చింది సాయిపల్లవి. నిజానిక్కూడా ఈ దఫా సాయిపల్లవికి నేషనల్ అవార్డు పక్కా అని పలువురి అభిప్రాయం.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/missworld-300x160.jpg)