హృతిక్‌రోషన్, ఎన్టీఆర్ నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్-2 ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను విడుదల చేశారు.ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్‌గా నిలిచాయి. ఎన్టీఆర్, హృతిక్‌రోషన్ నువ్వానేనా అనే రీతిలో పోటాపోటీ నటనను కనబరిచారు. ఎవరూ చేయలేని పనిని నేను చేసి చూపిస్తాను. ఎవరూ పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను, నేను యుద్ధంలో ఆయుధాన్ని,చస్తా లేదా చంపుతా అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది.

యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందించిన ఈ చిత్రానికి ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ విడుదల చేయనుంది. ఎన్టీఆర్ హిందీలో నేరుగా నటించిన తొలిచిత్రమిదే కావడంతో ఆయన అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
















