విశ్వక్సేన్ హీరోగా రామ్నారాయణ్ దర్శకత్వం వహించిన చిత్రం లైలా. సాహు గారపాటి నిర్మించారు. ఈ సినిమా నిర్వహించిన ప్రీ రిలీజ్ కార్యక్రమంలో నటుడు పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో విశ్వక్సేన్, సాహు గారపాటి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. మా కంట్రోల్లో లేకుండా ఒక వ్యక్తి చేసిన తప్పుకి మా సినిమాని బలి చేయకండి. ఇది మా విన్నపం. ఆ వ్యక్తికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన మా సినిమాలో నటించాడంతే. ఆయన తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను. దయచేసి సినిమాని విడుదల కాకముందే చంపకండి. ప్లీజ్ సపోర్ట్ లైలా. అయినా, ఆయన అన్న డైలాగ్ గానీ, సన్నివేశం గానీ సినిమాలో లేదు. ఈ సినిమా నాకెంతో స్పెషల్. లేడీ క్యారెక్టర్ కోసం చాలా కష్టపడ్డాను. బాయ్కాట్ లైలా అంటూ 25 వేల ట్వీట్లు చేశారు. రిలీజ్ రోజునే సినిమా హెచ్డీ ప్రింట్ లీక్ చేస్తాం అని బెదిరిస్తున్నారు. ఎవరో చేసిన తప్పుకి మేమెందుకు బలి కావాలి సార్ అని విశ్వక్సేన్ అన్నారు.
నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత బాయ్కాట్ లైలా అనే పోస్టులు చూసి షాక్ అయ్యాను. ఆయన అలా మాట్లాడేటప్పుడు మేము చిరంజీవిని ఆహ్వానించడానికి వెళ్లాం. సినిమా అనేది వేల మంది కష్టం. ఈ విషయాన్ని పాజిటివ్గా తీసుకోవాలని కోరుతున్నాం అని చెప్పారు. ఈ నెల 14న సినిమా విడుదలవుతోంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/uk-300x160.jpg)