రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పశ్చిమ దేశాలకు వార్నింగ్ ఇచ్చాడు. సాంకేతికంగా తాము అణ్వాయుధ యుద్ధానికి రెఢీగా ఉన్నామన్నారు. ఒకవేళ ఉక్రెయిన్‌కు అమెరికా తమ దళాలను పంపిస్తే, యుద్ధం మరింత జఠిలం అవుతుందని అన్నారు. అణ్వాయుధం వాడాల్సిన పరిస్థితి లేదు కానీ, మిలిటరీ కోణంలో ఆలోచిస్తే తాము రెఢీ ఉన్నామని తెలిపారు. పుతిన్ మాట్లాడుతూ ఒకవేళ అమెరికా న్యూక్లియర్ టెస్టింగ్ చేపడితే, అప్పు డు తాము కూడా ఆ పరీక్ష చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధంలో మానవ హనన ఆయుధాలను ఇప్పటి వరకు వినియోగించలేదని పుతిన్ స్పష్టం చేశారు. అణ్వాయుధాలు ఉన్నాయని, కానీ వాటి వినియోగించేందుకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయన్నారు. రష్యా సార్వభౌమత్వానికి ఏదైనా ప్రమాదం వాటిల్లితే అప్పుడు వెపన్స్ వాడుతామని ఆయన తెలిపారు. తమ వ్యూహాల్లో అన్నీ ఉన్నాయని, వాటినేమీ మార్చలేదన్నారు.
