
తమ దేశంలో ఉగ్రవాదులు లేరంటూ ఇన్నాళ్లూ బుకాయిస్తూ వస్తున్న పాకిస్థాన్, ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. గత మూడు దశాబ్దాలపాటు ఉగ్రవాద సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ అందిస్తున్నది నిజమేనని అంగీకరించింది. ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ బహిరంగంగా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. అయితే ఆ పాపానికి అమెరికా, పశ్చిమ దేశాలే కారణమని ఆరోపించారు. మంత్రి చేసిన ప్రకటనతో పాక్‌ను ఉగ్రదేశమని, ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నదని భారత్ చేస్తున్న ఆరోపణలు నిజమేనని మరోసారి రుజువైంది.
