Skip to main content

Namaste NRI

మేం ఆహ్వానించాం.. ఆ కారణం వల్లే ఎన్టీఆర్‌ రాలేకపోయాడు

ఇటీవల అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌  అవార్డుల కార్యక్రమంలో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం సత్తా చాటింది. నాలుగు విభాగాల్లో అవార్డులతోపాటు స్పాట్‌లైట్‌ అవార్డు కూడా అందుకుంది. దర్శకుడు రాజమౌళి , రామ్‌చరణ్‌, కీరవాణి, కె.కె.సెంథిల్‌ కుమార్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అవార్డులు అందుకున్నారు. అయితే ఎన్టీఆర్‌ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో ఆయన్ను పిలవలేదా? అంటూ నెటిజన్లు, అభిమానులు హెచ్‌సీఏ సంస్థను ప్రశ్నిస్తూ కామెంట్లు చేశారు. తారక్‌ (Tarak) ఈ వేడుకకు ఎందుకు రాలేకపోయాడు వివరణ ఇస్తూ ఓ పోస్ట్‌ చేసింది హెచ్‌సీఏ సంస్థ. తారక్‌ రాకపోవడానికి కారణాలను తెలిపింది. ఈ అవార్డుల కార్యక్రమానికి తారక్‌ను పిలిచామని, కానీ తారక్‌ ఇండియాలో ఓ సినిమా షూటింగ్‌ కారణంగా రాలేకపోయాడని హెచ్‌సీఏ తెలిపింది. అంతేకాకుండా తన సోదరుడు తారకరత్న మరణించడంతో షూటింగ్‌ కూడా నిలిపివేశారని వెల్లడించింది. అయితే త్వరలోనే ఈ అవార్డును ఎన్టీఆర్‌కు అందజేస్తామని, మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అంటూ ట్వీట్‌ చేసింది. దీంతో ఎన్టీఆర్‌ హెచ్‌సీఏ అవార్డుల కార్యక్రమానికి వెళ్లకపోవడంపై ఫ్యాన్స్‌కు ఫుల్‌ క్లారిటీ వచ్చేసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events