Namaste NRI

మా సినిమాలో ఆ ప్రయత్నం చేశాం : జయశంకర్‌

వినోద్‌వర్మ, అనసూయ భరద్వాజ్‌, సాయికుమార్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అరి. దర్శకుడు జయశంకర్‌. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్‌ మాట్లాడుతూ అరిషడ్వర్గాల గురించి ఎంతో మంది గొప్పవాళ్లు చెప్పారు కానీ, వాటిని జయించడానికి పరిష్కారాలను చూపించలేదు. మా సినిమాలో ఆ ప్రయత్నం చేశాం. ఈ సినిమా కథతో త్వరలో ఓ పుస్తకాన్ని తీసుకొస్తున్నాం. ఈ చిత్రానికి విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి ఆదరణ దక్కుతున్నది అని చెప్పారు. ఈ సినిమా ఇప్పుడే ఓటీటీలోకి రావడం లేదని, థియేట్రికల్‌ రన్‌ పూర్తయ్యాకే ఓటీటీ డేట్‌ ప్రకటిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events