Namaste NRI

అలాంటివి రిపీట్‌ కాకుండా.. ఈ సినిమాను జాగ్రత్తగా తీశాం

కిరణ్‌ అబ్బవరం నటించిన తాజా చిత్రం క.  ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌కు సుజీత్‌, సందీప్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రత్యేకంగా ప్రదర్శించారు. కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ నా గత చిత్రాలు కొన్నింటిలో కంటెంట్‌ పరంగా తప్పులు జరిగాయి. అలాంటివి రిపీట్‌ కాకుండా ఈ సినిమాను జాగ్రత్తగా తీశాం. ఇందులో అనవసరపు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉండవు. క్లైమాక్స్ ఘట్టాలు ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్‌ చేస్తాయి అన్నారు. ఈ సినిమాలో తాను పోషించిన వాసుదేవ్‌ పాత్రలో గ్రేషేడ్స్‌ కూడా కనిపిస్తాయని చెప్పారు. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులే లక్ష్యంగా ఈ సినిమా తీశానని, 80వ దశకాన్ని ప్రతిబింబించేలా ప్రతీ సన్నివేశాన్ని అద్భుతంగా డిజైన్‌ చేశామని, కృష్ణగిరి అనే గ్రామంలో చోటుసుకునే అనూహ్య సంఘటనలు ప్రేక్షకుల్ని థ్రిల్‌కి గురిచేస్తాయని దర్శకుడు తెలిపారు. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: విశ్వాస్‌ డానియేల్‌, సతీష్‌ రెడ్డి మాసం, సంగీతం: సామ్‌ సీఎస్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress