విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం తంగలాన్. పా.రంజిత్ దర్శకుడు. తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ విడుదల చేస్తున్నది. విజయవాడలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ తంగలాన్ థ్రిల్లింగ్ అడ్వెంచరస్ మూవీ. కోలార్ గోల్డ్‌ఫీల్డ్స్ నేపథ్యంలో ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. తప్పకుండా థియేటర్స్‌లో చూసి ఈ అడ్వెంచరస్ జర్నీని ఆస్వాదించండి అన్నారు. నా అపరిచితుడు మూవీ దేశంలోనే అత్యధిక రోజులు విజయవాడలో ఆడింది. తెలుగు ప్రేక్షకులు నాపై ఎంతో అభిమానం కనబరుస్తారు. తంగలాన్ సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది అన్నారు.
ఈ సినిమాలో తాను పోషించిన ఆరతి పాత్ర కెరీర్‌లో బెస్ట్‌రోల్ అని కథానాయిక మాళవిక మోహనన్ తెలిపింది. సినిమాలో విక్రమ్ మేకోవర్, పాత్ర కోసం ఆయన పడిన కష్టం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుందని నిర్మాత ధనుంజయన్ పేర్కొన్నారు. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకొస్తున్నది. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: స్టూడియోగ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్, నిర్మాత: కేఈ జ్ఞానవేల్‌రాజా, దర్శకత్వం: పా.రంజిత్.