సోనియా గాంధీ భిక్షతోనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అధికారం అనుభవిస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి కేటీఆర్, అడ్డగోలుగా మాట్లాడితే తాట తీస్తామని అన్నారు. చరిత్ర మరిచిపోయి మాట్లాడితే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. రేవంత్ టీడీపీకి రాజీనామా చేసిన తర్వాతే కాంగ్రెస్‌లో చేరారని అన్నారు. సంతలో కొన్నట్లు నాయకులను కొనేవాళ్లా కాంగ్రెస్ గురించి మాట్లాడేది అని ప్రశ్నించారు. 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌కు రేవంత్ రాష్ట్ర అధ్యక్షులయ్యారు. మరోసారి రేవంత్‌పై అడ్డగోలుగా మాట్లాడితే తాట తీస్తామని హెచ్చరించారు.
కేటీఆర్ కేవలం ప్రాంతీయ పార్టీకే వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రమేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కల్వకుంట్ల డబ్బు సంచులకు అమ్ముడుపోయిన 12 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపుదారులను వదిలిపెట్టమని ఆయన అన్నారు. కేటీఆర్‌కు ధైర్యం ఉంటే ఫిరాయింపులపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.