జూన్ 21న ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో అధికారిక పర్యటన చేపట్టనున్న సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఇండో అమెరికన్లు సమాయత్తమవుతున్నారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో టైం స్క్వేర్ వద్ద ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో మోదీకి స్వాగతం అంటూ పెద్ద ఎత్తున ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించారు. అమెరికాలో 20 పట్టణాల్లోని ప్రసిద్ధి గాంచిన స్థలాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


మోదీ చేపట్టనున్న ఈ పర్యటన కోసం యావత్ భారతీయ అమెరికన్ సమాజం ఉత్సాహంగా ఎదురుచూస్తోందని అడపా ప్రసాద్ తెలిపారు. జూన్ 21న వైమానిక స్థావరం వద్దకు వెళ్లి మోదీకి స్వాగతం చెప్పేందుకు ఇండో అమెరికన్లు సిద్ధమవుతున్నారని కృష్ణారెడ్డి ఏనుగుల, విలాస్ జంబుల పేర్కొన్నారు. జూన్ 21న న్యూయార్క్ నగరంలో నిర్వహించనున్న యోగా దినోత్సవంలో మోదీ పాల్గొననున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత 22న వైట్‌హౌస్‌లో మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు గౌరవ విందు ఇస్తారు.

