Namaste NRI

వామ్మో వణికిస్తున్న..డీమాంటీ కాలనీ 2 ట్రైలర్

హారర్‌ థ్రిల్లర్‌ డీమాంటీ కాలనీ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందించిన సినిమా  డీమాంటీ కాలనీ-2’. అరుల్‌నిధి, ప్రియా భవానీ శంకర్‌ జంటగా నటించారు. అజయ్‌ ఆర్‌ జ్ఞానముత్తు దర్శకుడు. ఈ చిత్రాన్ని రాజ్‌వర్మ ఎంటర్‌ టైన్‌మెంట్‌, శ్రీబాలాజీ ఫిల్మ్స్‌ సంయుక్తంగా తెలుగులో విడుదల చేస్తున్నాయి. ఆగస్ట్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను అగ్ర దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ సోషల్‌మీడియా ద్వారా విడుదల చేశారు.

ఓ ఇంట్లో అనూహ్య సంఘటనలు జరుగుతుంటాయి. అందులోకి వెళ్లిన వారంతా భయంకరమైన అనుభవాల న్ని ఎదుర్కొంటారు. ఇంతకి డీమాంటీ ఇంట్లో ఉన్న శక్తి ఏమిటి? దాని నుంచి వారు ప్రాణాలను ఎలా కాపాడు కున్నారు? అనే విషయాలు ఉత్కంఠను పంచుతాయని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సామ్‌ సీఎస్‌ సంగీతాన్నందించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress