కాలింగ్ బెల్, రాక్షసి వంటి హారర్ థ్రిల్లర్స్ చిత్రాలను రూపొందించిన దర్శకుడు పన్నారాయల్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఇంటి నెం.13. దర్శకుడు పన్నా రాయల్ మాట్లాడుతూ మిస్టరీ బేస్డ్ హారర్ మూవీ ఇది. అన్ని వర్గాలను అలరించే అంశాలు ఈ చిత్రంలో వుంటాయి అన్నారు. వినోద్ యాజమాన్య అద్భుతమైన పాటలు చేశారు అన్నారు. నిర్మాత హేసన్ పాషా మాట్లాడుతూ ఆద్యంతం ఉత్కంఠ రేపే ఆసక్తికరమైన కథాంశంతో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఫైనల్ అవుట్పుట్ చూసుకున్న తరువాత సినిమా విజయంపై నమ్మకం కలిగింది అన్నారు. ఈ చిత్రంలో నవీద్బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్ నికీషా, ఆనంద్రాజ్, తనికెళ్ల భరణి, పృథ్వి రాజ్, సత్యకృష్ణ, విజయ రంగరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : వినోద్ యజమాన్య. హేసన్ పాషా నిర్మాత. మాటలు: వెంకట్ బాలగోని, పాటలు : రాంబాబు గోశాల.














