Skip to main content

Namaste NRI

ఇంటి నంబర్ 13లో ఏం జరిగింది?

కాలింగ్‌ బెల్‌, రాక్షసి వంటి హారర్‌ థ్రిల్లర్స్‌ చిత్రాలను రూపొందించిన దర్శకుడు పన్నారాయల్‌ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఇంటి నెం.13. దర్శకుడు పన్నా రాయల్‌ మాట్లాడుతూ మిస్టరీ బేస్డ్‌ హారర్‌ మూవీ ఇది. అన్ని వర్గాలను అలరించే అంశాలు ఈ చిత్రంలో వుంటాయి అన్నారు. వినోద్‌ యాజమాన్య అద్భుతమైన పాటలు చేశారు అన్నారు. నిర్మాత హేసన్‌ పాషా మాట్లాడుతూ ఆద్యంతం ఉత్కంఠ రేపే ఆసక్తికరమైన కథాంశంతో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఫైనల్‌ అవుట్‌పుట్‌ చూసుకున్న తరువాత సినిమా విజయంపై నమ్మకం కలిగింది అన్నారు. ఈ చిత్రంలో నవీద్‌బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్‌ నికీషా, ఆనంద్‌రాజ్‌, తనికెళ్ల భరణి, పృథ్వి రాజ్‌, సత్యకృష్ణ, విజయ రంగరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : వినోద్‌ యజమాన్య. హేసన్‌ పాషా నిర్మాత. మాటలు: వెంకట్‌ బాలగోని, పాటలు : రాంబాబు గోశాల.

Social Share Spread Message

Latest News