కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా దర్శకద్వయం సుజీత్-సందీప్ రూపొందించిన చిత్రం క. చింతా గోపాల కృష్ణారెడ్డి నిర్మాత. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ప్రేక్షకులు గతంలో నన్ను పక్కింటి కుర్రాడు అనే ఇమేజ్‌తో చూశారు. ఇప్పుడు వారి సొంత ఇంటి అబ్బాయిలా చూస్తున్నారు. క చిత్రం నా కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది అన్నారు. ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందా అనేది ముఖ్యం కాదు. ప్రేక్షకులకు బాగా చేరువైందనే విషయమే ఎక్కువ సంతోషాన్నిస్తున్నది. ఒక హీరోగా నాకు ఇంతకంటే ఏం కావాలి? ఈ చిత్రానికి తప్పకుండా సీక్వెల్ చేస్తాం అన్నారు.
కథ విన్నప్పుడే కంటెంట్ చాలా కొత్తగా అనిపించిందని, సినిమా కోసం టీమ్ అంతా ప్రాణం పెట్టి పనిచేశారని, తొలి రెండు రోజుల్లోనే 13.11కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమా చూసినప్పుడే ఏదో మ్యాజిక్ జరగబోతుందనే భావన కలిగిందని డిస్ట్రిబ్యూ టర్ వంశీ నందిపాటి తెలిపారు. తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ సాధించడం ఆనందంగా ఉందని దర్శకులు తెలిపారు.