
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర. ఈ సినిమాకి సీక్వెల్ ఉన్నట్లు దర్శకుడు ప్రకటించారు. దేవరను తన కొడుకే ఎందుకు పొడిచాడు? అనే ప్రశ్న అభిమానుల్లోనూ, సగటు ప్రేక్షకుడిలోనూ ఇప్పటికీ అలాగే ఉంది. ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే దేవర 2 మొదలవ్వాలి. అదెప్పుడు? అని అంతా ఎదురు చూస్తున్న తరుణంలో చిత్ర నిర్మాతల్లో ఒకరైన మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించారు. ఈ ఏడాది మే నెలలో దేవర 2 పనులు మొదలుకానున్నాయని, వచ్చే ఏడాది సినిమాను విడుదల చేస్తామని ఆయన తెలిపారు. తొలిభాగం కంటే ఈ రెండో భాగం చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని, పార్ట్ -1లో చూసింది పది శాతమే అనీ, రెండోభాగంలో వందశాతం చూస్తారని దర్శకుడు కొరటాల శివ చెబుతున్నారు. ఈ అప్‌డేట్ తారక్ అభిమానులకు గొప్ప శుభవార్తే అని చెప్పాలి.















