దక్షిణ గాజాలోని రఫా నగరంపై తాము దాడి చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. ఆరునూరైనా ఈ యుద్ధంలో విజయం సాధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. నెతన్యాహూ మాట్లాడుతూ హమాస్ తో కాల్పుల విరమణ చర్చలు కొనసాగుతున్న క్రమంలో దానిపై ఒప్పందం కుదరినా, కుదరకపోయి నా, హమాస్‌లను అంతం చేయడానికి ఇజ్రాయెల్ దళాలు రఫాలోకి ప్రవేశిస్తాయన్నారు.ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా వేలాది మంది పాలస్తీనియన్లు రఫా నగరంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలో బందీల విడుదలకు, కొంత ఉపశమనం పొందడానికి రెండు దేశాల మధ్య కాల్పుల ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. అయితే మా లక్ష్యాలను సాధించకుండా యుద్ధం నిలిపివేసే సమస్యే లేదు. మేము రఫాలోకి ప్రవేశిస్తాం. హమాస్ దళాలను పూర్తిగా తుడిచిపెట్టేస్తాం. కాల్పుల విరమణపై ఒప్పందం జరిగినా, జరగకపోయి నా ఈ యుద్ధంలో పూర్తి విజయం సాధిస్తాం అని పేర్కొన్నారు.