Namaste NRI

శ్వేతసౌథం కీలక ప్రకటన .. ప్రధాని మోడీకి బైడెన్

అమెరికా పర్యటన దశలో ప్రధాని మోడీకి తమ దేశ అధ్యక్షలు బైడెన్ మానవ హక్కులపై ఉపదేశాలు, లెక్చర్లు ఇచ్చే ప్రసక్తే లేదని వైట్‌హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో భారతదేశంలో పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనలు, మైనార్టీల భద్రతపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. దీనిని ప్రధాని మోడీతో బైడెన్ ప్రస్తావించాల్సి ఉందని అమెరికాకు చెందిన హక్కులు, మతస్వేచ్ఛల సంస్థలు కొన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. కొందరు చట్టసభ సభ్యులు కూడా తమ ప్రకటనలలో మోడీని ఈ విషయంలో దీని గురించి ప్రస్తావించాల్సి ఉందని తెలిపాయి.

అయితే ఇటువంటిదేమీ ఉండదని అధ్యక్ష భవనం శ్వేతసౌథం నుంచి కీలక ప్రకటన వెలువరించారు. ప్రధాని మోడీ ఈ విషయం గురించి బైడెన్ ఎటువంటి ఉపదేశం ఇచ్చే ప్రసక్తే లేదని ఇందులో తెలిపారు. పత్రికా స్వేచ్ఛ, మతస్వేచ్ఛ ఇతర విషయాల విషయానికి వస్తే వీటిపై అమెరికా తరఫున కేవలం అభిప్రాయాలను తెలియచేయడం జరుగుతుంది తప్పితే దీనిని సందేశంగా లెక్చర్‌గా భావించాల్సిన అవరం లేదని వైట్‌హౌస్ తెలిపింది. భారత్‌లో వ్యవస్థలు, రాజకీయాలు ఎటువెళ్లుతాయనేది చెప్పడానికి తాము సిద్ధంగా లేరని, దీనిపై తేల్చుకోవల్సింది కేవలం భారతీయులు, అక్కడి పౌరులే అని స్పష్టం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events