రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను అరెస్టు చేయాలని గతంలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) ఆదేశాలు జారీ చేసింది. కానీ కొన్ని రోజుల క్రితం మంగోలియాలో పుతిన్ పర్యటించారు. ఈ సందర్భంగా అతన్ని అరెస్టు చేయాలని ఐసీసీ తన వారెంట్‌లో తెలిపింది. కానీ ఆ అరెస్టు వారెంట్‌ను ఐసీసీ పట్టించు కోలేదు. తటస్థ విధానం, ఇంధన అవసరాల దృష్ట్యా ఆ విషయాన్ని పట్టించుకోలేదని పేర్కొన్నారు. యుద్ధ నేరాలకు పాల్పడిన పుతిన్ ను అరెస్టు చేయాలని ఇటీవల ఐసీసీ వారెంట్ జారీ చేసింది. అయితే ఎనర్జీ అవసరాల కోసం పొరుగుదేశాలపై మంగోలియా ఆధారపడుతుందని, అందుకే తటస్థంగా ఉన్నట్లు మంగోలియా అధికారి ఒకరు తెలిపారు.
ఐసీసీలో మంగోలియా సభ్యదేశమే. 95 శాతం పెట్రోలియం ఉత్పత్తులతో పాటు 20 శాతం విద్యుత్తును రష్యా నుంచి మంగోలియా దిగుమతి చేసుకుంటోంది. దౌత్య సంబంధమైన విషయాల్లో తటస్థంగా వ్యవహరిస్తున్న ట్లు మంగోలియా వెల్లడించింది. అధ్యక్షుడు ఉకనాగిన్ కురేల్‌సుక్ ఆహ్వానం మేరకు పుతిన్ మంగోలియాలో పర్యటించారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలపై చర్చించారు.