భారత్ పౌరసత్వ సవరణ చట్టం ( సీఏఏ) అమలు చేయడంపై ఇటీవల అమెరికా ఆందోళన వ్యక్తం చేయడాని కి సీనియర్ న్యాయవాది, మాజీ సొలిసిటర్ జనరల్ హరిశ్ సాల్వే తప్పుపట్టారు. ప్రపంచ వ్యాప్తంగా వేధింపుల కు గురువుతున్న మైనార్టీల కోసం అమెరికా సరిహద్దులు తెరుస్తుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకిస్థాన్‌లో వేధింపులకు గురయ్యే అహ్మదీయులు, మయన్మార్‌లోని రోహింగ్యాలు, దారుణంగా ప్రాణాలు కోల్పోతున్న పాలస్తీనావాసులకు అమెరికా పౌరసత్వం ఇస్తుందా? అని ప్రశ్నించారు. ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చే అంశాన్ని అమెరికా పున పరిశీలించుకోవాలన్నారు. అంతర్గత సమస్యలపై దృష్టిపెట్టాలని అమెరికాకు సాల్వే హితవు పలికారు.