తాను హిందూనని, పొలిటికల్ కెరీర్ కోసం మతం మారబోనని ఇండియన్-అమెరికన్ వివేక్ రామస్వామి తేల్చిచెప్పారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం ఆశిస్తున్న ఆయనను, హిందూ నేతను అమెరికా అధ్యక్షుడిగా అంగీకరిస్తుందా? అని మీడియా ప్రశ్నించగా, నేను హిందూ, పొలిటికల్ కెరీర్ కోసం మతం మారను అని కుండబద్దలు కొట్టారు. హిందూమతం, క్రైస్తవ మతం ఉమ్మడి విలువలు కలిగి ఉంటాయని చెప్పారు. నేను రాజకీయంగా జీవితంలో ఎదగాలనుకుంటే మతం మార్చుకోవచ్చు. కానీ, నేను అలా చేయబోను అని పేర్కొన్నారు.
