
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత నవీన్ యెర్నేని క్లాప్‌నివ్వగా, దిల్ రాజు కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ హారర్ మిస్టరీ కథాంశమిది. సరికొత్త బ్యాప్ డ్రాప్ తో ఆకట్టుకుంటుంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్ సినిమాపై ఆసక్తిని పెంచింది. సీట్ఎడ్జ్ థ్రిల్లర్ గా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందించే చిత్రమవుతుంది అన్నారు. ఈ నెల 11 నుంచి రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెడతామని నిర్మాత సాహు గారపాటి తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: చిన్మయ్ సలాస్కర్, సంగీతం: బి.అజనీష్ లోక్‌నాథ్, ఆర్ట్: శివ కామేష్, ప్రొడక్షన్ డిజైన్: మనీషా ఏ దత్, రచన-దర్శకత్వం: సాహు గారపాటి.
