ఉక్రెయిన్‌తో యుద్ధం కోసం భారీగా సైన్యాన్ని సమీకరించాలన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాల నేపథ్యంలో తమను నిర్బంధంగా చేర్చుకుంటారన్న భయం తో మాజీ సైనికులు, యువకులు భారీగా దేశం వీడుతున్నారు. వారం రోజుల్లో ఏకంగా 98,000 మంది కజకిస్తాన్ చేరారు. నడిచి, సైకిల్‌పై, కారులో, అద్దె వాహనంలో, విమానాల్లో ఇలా ఎలా కుదిరితే అలా వెళ్లిపోతున్నారు. దాంతో మైళ్ల కొద్దీ ట్రాఫిక్ స్తంభించింది. మరికొందరు జార్జియా, మంగోలియా తదితర దేశాలకు వెళ్లిపోతున్నారు. దీంతో ఇప్పటి వరకు లక్ష మంది రష్యాను వీడారు.














