హీరో సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం టిల్లు స్క్వేర్. డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌తో అసోసియేట్ అవుతూ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రల పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి టికెటే కొనకుండా సాంగ్‌ను లాంఛ్ చేశారు మేకర్స్. రామ్ మిర్యాల మ్యాజికల్ వాయిస్‌తో సాగుతున్న ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఫిదా చేయడం పక్కా అని తెలిసిపోతుంది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను స్వీయ కంపోజిషన్‌లో రామ్ మిర్యాల పాడాడు. టిల్లు 2 చిత్రాన్ని సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని సెప్టెంబర్ 15న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
