Namaste NRI

రామ్‌ లేకపోతే ఈ సినిమా లేదు :  పూరి జగన్నాథ్‌

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రామ్‌ కథానాయకుడిగా నటించిన డబుల్‌ ఇస్మార్ట్‌ ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది. పూరి కనెక్ట్స్‌ పతాకంపై పూరి జగన్నాథ్‌, ఛార్మికౌర్‌ నిర్మించారు. హన్మకొండలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ మీ ఊరు రాకుండా మిమ్మల్ని కలవకుండా మా సినిమాలు రిలీజ్‌ కావు. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే రామ్‌ ఎనర్జీ గురించే మాట్లాడాలి. రామ్‌ సెట్‌లో అడుగుపెట్టగానే ఏదో శక్తి వస్తుంది. అద్భుతమైన డ్యాన్స్‌, తెలంగాణ యాసతో తన పాత్రను రక్తికట్టించాడు. రామ్‌ లేకపోతే ఈ సినిమా లేదు అన్నారు.

  హీరో రామ్‌ ఇస్మార్ట్‌శంకర్‌ కంటే డబుల్‌ఎనర్జీతో ఈ సినిమా చేశారు. నా సినిమా ఒకటి ఫ్లాప్‌ అయినప్పుడు రచయిత విజయేంద్రప్రసాద్‌గారు ఫోన్‌ చేసి సర్‌ నాకు చిన్న హెల్ప్‌ చేస్తారా అనడిగారు. ఆయన కొడుకే పెద్ద డైరెక్టర్‌, నేను చేసే హెల్ప్‌ ఏముంటుందని అనుకున్నా. మీరు నెక్ట్స్‌ సినిమా చేసే ముందు కథ చెబుతారా? ఏమైనా చిన్న మార్పులుంటే సూచిస్తాను. ఎందుకంటే మీలాంటి డైరెక్టర్స్‌ ఫెయిల్యూర్‌ అయితే నేను చూడలే ను అన్నారు. ఆ రోజు నేను చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యా. అందుకే ఒళ్లు దగ్గర పెట్టుకొని ఈ సినిమా చేశా. మా టీమ్‌ అందరికి ఓ బ్లాక్‌బస్టర్‌ అవసరం. ఈ సినిమాతో అది దక్కుతుందని ఆశిస్తున్నా అన్నారు.

హీరో రామ్‌ మాట్లాడుతూ ఐదేళ్ల తర్వాత మళ్లీ వరంగల్‌కు వచ్చాను. ఇప్పటికీ కూడా తెలుగు ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్‌ మోస్ట్‌ ఇన్‌స్పైరింగ్‌ డైరెక్టర్‌. కొత్త దర్శకులు ఆయన స్ఫూర్తితో ఇండస్ట్రీలోకి వస్తుంటారు. నా ఫోన్‌ కాంటాక్ట్‌లో పూరిగారి పేరును గన్‌ అని పెట్టుకున్నా. ఎందుకంటే హీరోలు బుల్లెట్ల లాంటివారు. పేల్చే గన్‌ కరెక్ట్‌గా ఉంటే బుల్లెట్‌ పర్‌ఫెక్ట్‌గా వెళుతుంది. పూరి లాంటి గన్‌ ప్రతి యాక్టర్‌కి అవసరం. ఇక ఏ విషయమైనా ముందు మనకు నచ్చిందో లేదో తెలుసుకోవాలి. అది సినిమా అయినా బిర్యానీ అయినా పక్కోడి ఒపీనియన్‌ గురించి పట్టించుకోవద్దు. నేను జనరల్‌గా సలహాలు ఇవ్వను. కానీ మీరంతా నా మనుషులే అని భావించి ఇచ్చాను అన్నారు. డబుల్‌ ఇస్మార్ట్‌ పాటలు, ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించిందని, సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నామని ఛార్మి తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events