రాజకీయంగా టీఆర్‌ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ము లేకనే బీజేపీ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసులతో భయపెడుతుందని ఎన్నారై టీఆర్‌ఎస్ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఢల్లీి మద్యం పాలసీకి సంబంధించి ఎమ్మెల్సీ కవితపై నిరాధారణమైన అరోపణలు చేయడమే కాకుండా, ఆమె ఇంటిపై దాడికి పాల్పడ్డ బీజేపీ నేతల చర్యలను తీవ్రంగా ఖండిరచారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న టీఆర్‌ఎస్ నాయకత్వంపై బురదజల్లి, మునుగోడు ఉప ఎన్నికల్లో లబ్ది పొందాలని అలాగే తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ కుట్రలు చేస్తుందని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కేసీఆర్ భయం పట్టుకుందన్నారు. ప్రాంతీయ పార్టీల పట్ల కక్ష పూరిత విధానాలను అవలంభిస్తూ ఆయా ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తూ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తీస్తున్నదని ఆమె పేర్కొన్నారు. బీజేపీ మతతత్వ, కక్షపూరిత రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని సరైన సమయంలో ప్రజలే బీజేపీకి బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు.














