Namaste NRI

యష్ టాక్సిక్ టీజర్ వచ్చేసింది

యశ్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌. వెంకట్‌ కె.నారాయణతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి గీతూ మోహన్‌దాస్‌ దర్శకురాలు. కియారా అద్వానీ, నయనతార, రుక్మిణీవసంత్‌ కథానాయికలు. హ్యుమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రధారులు. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అలాగే సినిమాపై అంచనాలను కూడా పెంచింది. తాజాగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు.

ఓ కొత్త హింసాత్మక ప్రపంచాన్ని ఈ టీజర్‌ ఆవిష్కరించింది. సర్కస్‌ వాతావరణం, తూర్పు ఆసియా శైలిని గుర్తు చేసే ప్రపంచం ఇలా వివిధ కాలాల్లో కథ ప్రయాణిస్తున్నట్టు టీజర్‌ చెబుతున్నది. ఇందులో యాక్షన్‌ సన్నివేశాల్లో హింస ఎక్కువగా కనిపిస్తున్నా, అంతర్గతంగా ఏదో లోతైన భావాన్ని ఆ హింస ఆవిష్కరిస్తున్నది. టేకింగ్‌ విషయంలో ప్రత్యేక శ్రద్ధ, నటీనటుల శక్తివంతమైన నటన ఈ టీజర్‌కు హైలైట్స్‌. ఇందులో హీరో యష్‌ ఓ విపత్తులా కనిపిస్తున్నాడు. రూపం, లోతైన హావభావాలు పాత్రలోని తీవ్రతను, ఉద్వేగాన్ని తెలియజేస్తున్నాయి. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ఈ సినిమా విడుదల కానున్నది.

Social Share Spread Message

Latest News