Namaste NRI

యష్‌ తల్లి నిర్మాతగా..ఆకట్టుకుంటోన్న కొత్తలవాడి టీజ‌ర్‌

కన్నడ యువ హీరో పృథ్వీ అంబర్‌ నటిస్తున్న తాజా చిత్రం కొత్తలవాడి. సిరాజ్‌ దర్శకత్వం. అగ్ర హీరో యష్‌ తల్లి పుష్ప అరుణ్‌కుమార్‌ నిర్మాణరంగంలోకి అడుగుపెడుతూ తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. కొత్తలవాడి కర్ణాటకలోని చామరాజనగర్‌ జిల్లాలోని ఓ గ్రామం. ఆ ప్రాంతం తాలూకు మూలాలను, ఆచార వ్యవహారాలను ప్రతిబింబిస్తూ, అక్కడే అధిక భాగం చిత్రీకరణ జరిపామని, హృద్యమైన గ్రామీణ ప్రేమకథగా మెప్పిస్తుందని చిత్రబృందం తెలిపింది. త్వరలో తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News