
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు మరో నాటో దేశం షాకిచ్చింది. స్పెయిన్ బాటలోనే ఇటలీ కూడా నడిచింది. తమ కీలక వైమానిక స్థావరమైన సిసిలీలో అమెరికా యుద్ధ విమానాల ఆపరేషన్లపై నిషేధం విధించింది. సిగొనెల్లా ఎయిర్ స్టేషన్‌లో కొన్ని బాంబర్స్ ల్యాండ్ కావడానికి అనుమతి ఇవ్వాలని ట్రంప్ యంత్రాంగం మెలోని ప్రభుత్వాన్ని కోరింది. అయితే దీన్ని ఇటలీ తిరస్కరించింది. తమ గగనతలాన్ని వాడేందుకు అమెరికా యుద్ధ నౌకలకు స్పెయిన్ అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే.















