Namaste NRI

వాషింగ్టన్ డీసీలో ప్రవాస భారతీయుల ఆధ్వర్యంలో… యోగా అభ్యసన కార్యక్రమం

ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ప్రవాస భారతీయుల ఆధ్వర్యంలో యోగా అభ్యసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయుల తల్లిదండ్రులు యోగా సాధన చేశారు. ఈ కార్యక్రమాన్ని భాను మాగులూరి సమన్వయ పరిచారు.  భాను మాగులూరి మాట్లాడుతూ పెద్దలంతా తమ ఆరోగ్యాన్ని కాపాడుకొని తమ జీవిత అనుభవాలను భవిష్యత్ తరాలకు అందించాలని కోరారు. యోగా సాధన వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన పెంచడమే అంతర్జాతీయ యోగా దినోత్సవం లక్ష్యమని అని అన్నారు. యోగా సాధనలో చిన్నారులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతో అవసరమని అన్నారు. యోగా ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరమని అన్నారు. యోగా వ్యాయామం మాత్రమే కాదు, జీవన విధానమని తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో యోగాంధ్రను పెద్ద ఎత్తున చేపడుతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బూర్ల రామకృష్ణ, వనపర్తి నాగిరెడ్డి, వనమా లక్ష్మీనారాయణ, ఎండూరు సీతారామారావు, నంబూరి చంద్రనాథ్, బండితోపు సత్యనారాయణ, చిట్టెల సుబ్బారావు, చామర్తి శ్రావ్య, గోవన మోహనరావు, చెరుకూరి ఇందు శేఖర్ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News