Namaste NRI

డబ్బు లేకుండా పుట్టొచ్చు కానీ,  డబ్బు లేకుండా మాత్రం చచ్చిపోవద్దు

విశ్వక్ సేన్  హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ధమ్‌కీ. నివేదా పేతురాజ్ హీరోయిన్‌ గా నటిస్తోంది.  విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వం. ఈ చిత్రాన్ని వన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కామెడీ థ్రిల్లర్ జోనర్‌లో  తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రసన్నకుమార్ బెజవాడ కథనందిస్తున్నాడు.  ధమ్ కీ ట్రైలర్ 2.0 ను మేకర్స్ లాంఛ్ చేశారు. ఫార్మా రంగం చుట్టూ తిరిగే కథాంశంతో ఫన్ అండ్ సీరియస్ ఎలిమెంట్స్ తో సినిమా సాగనున్నట్టు ట్రైలర్‌తో  చెప్పేశాడు. డబ్బు లేకుండా పుట్టొచ్చు కానీ,  డబ్బు లేకుండా మాత్రం చచ్చిపోవద్దు అని విశ్వక్ సేన్ చెబుతున్న డైలాగ్స్ సినిమాకే హైలెట్‌గా  నిలిచేలా ఉన్నాయి.  పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రావు రమేశ్, పృథ్విరాజ్, హైపర్ ఆది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా  విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events