వంశీ గోనే, రమ్య ప్రియ నాయకనాయికలుగా సూపర్ రాజా ప్రధాన పాత్రలో నటిస్తూ, స్యీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు. తాజాగా ఆ సినిమా టైటల్ గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత సూపర్ రాజా మాట్లాడుతూ తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటివరకు ఎవరు చేయని సినిమా ఇది. ఒకే షాట్‌లో రూపొందించిన ఈ రెండు గంటల చిత్రంలో దాదాపు పదిహేను వందల డైలాగులు విరామం లేకుండా చెప్పాం. ఈ సినిమా కోసం వంశీ, నేను ఏడు నెలలు రిహార్సల్స్ చేశామని తెలిపారు. ఇంకా చిత్ర తారాగణమంతా మాట్లాడారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది.